బస్సులో గొడుగు వేసుకుని ప్రయాణం
వినకొండ లో శనివారం ఉదయం నుండి ఎడతెరిపికొండ భారీ వర్షం కురుస్తుంది. వినుకొండ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు కొన్ని కారుతున్నాయి. బస్సు పై బాడీకి చిల్లులు పడటం, తుప్పుపట్టి అతుకులు పడడంతో వర్షానికి బస్సు అంతా కారుతుంది. దీంతో ప్రయాణికులు తడిసి ముద్దయి ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు వెంట తెచ్చుకున్న గొడుగులు బస్సుల్లో వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.