బద్వేలు పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో బుధవారం ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పై విద్యార్థినీ, విద్యార్థులు ర్యాలీ చేసి నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ పై రాజగోపాల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులకు పలు సలహాలు, సూచనలు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.