జమ్మలమడుగులో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగి వసూళ్లకు పాల్పడినట్లు లబ్ధిదారులు ఆరోపించారు. పంపిణీలో ఒక్కొక్కరి దగ్గర రూ. 300 తీసుకున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారి పెన్షన్లు తొలగిస్తామని బెదిరించినట్లు పింఛనుదారులు వాపోయారు. ఆఫీస్ స్టేషనరీ కోసం వసూలు చేసినట్లు ఆ ఉద్యోగి ఒప్పుకున్నట్లు స్థానికులు అంటున్నారు.