కడప 27వ డివిజన్ గౌస్ నగర్ లో నీటికొరత ఎక్కువగా ఉందని శనివారం స్థానిక ఎమ్మెల్యే మాధవికి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిలకు వినతిపత్రాన్ని అందించారు. రెండు రోజులకు ఒకసారి మంచినీరు వస్తుందని చెప్పారు. ముందస్తుగా డివిజన్ పరిధిలో నాలుగు బోరింగ్ వేయించాలని అభ్యర్థించారు. వేసవికాలం ప్రారంభ సమయంలోనే ఈ సమస్య ఉందని, రాబోయే రోజుల్లో ఈ సమస్య లేకుండా చూడాలని కోరారు.