కమలాపురంలోని గురుకుల పాఠశాలలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి బాధ్యులైన ఇద్దరు అధ్యాపకులకు మెమోలు జారీ చేసినట్లు ప్రిన్సిపల్ తులశమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులుగా పత్రికల్లో వస్తున్న కథనాలకు స్పందనగా తాను ఈ విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె అందులో పేర్కొన్నారు. తమ కళాశాలలో జరుగుతున్న విషయాలపై ఉన్నతాధికారులకు సమాచారం ఎప్పటికప్పుడు నివేదిస్తున్నాని తెలిపారు.