వీరపునాయుని పల్లె మండలం పాలగిరి క్రాస్ వద్ద వెలసిన సద్గురు కాశీనాయన స్వామి ఆలయం వద్ద ఆదివారం బండలాగుడు పోటీలను నిర్వాహకులు శనివారం తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి న్యూ కేటగిరి రాష్ట్ర స్థాయి విభాగంలో బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు చీటీలు ఇవ్వడం జరుగుతుందని ప్రవేశమునకు 500 రూపాయలని అన్నారు. విజేతలైన ఎడ్లకు బహుమతుల ప్రధానం ఉంటుందని తెలిపారు.