ఎన్నికల్లో సాధ్యం, వీలు కాని హామీలను ఇస్తున్నామని తెలిసి కూడా కూటమి ప్రభుత్వం అబద్ధపు హామీలన్నీ ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు విమర్శించారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన ఒక ప్రకటనలో తెలుపుతూ విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈనెల 27న వైసీపీ అధిష్టానం పిలుపుమేరకు రామేశ్వరం నుంచి గాంధీ రోడ్డు మీదుగా విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.