ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని ప్రజలు తినలేక అమ్ముకుంటున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ అక్రమ బియ్యం రవాణాను అరికట్టాలంటే ప్రజలు తినే బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. బియ్యం అక్రమ రవాణా అయినా, విద్యుత్ ఛార్జీలు పెరిగినా. ఏమి జరిగినా జగనే అని విమర్శించడంలో అర్థం ఉందా అని ప్రశ్నించారు.