పులివెందుల పట్టణంలోని స్థానిక అర్భన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని పోలీసులు విచారణ నిమిత్తం పిలిపించారు. ఉన్నతాధికారులు అందుబాటులో లేకపోవడంతో రాఘవరెడ్డిని పిలిపించామని సీఐ నరసింహులు తెలిపారు. విచారణలో భాగంగా రాఘవరెడ్డిని పిలిపించామని, అంతే తప్ప మరేమీ లేదని సీఐ తెలిపారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు.