భారత తొలి రాష్ట్రపతి, భారత రత్న స్వర్గీయ బాబూ రాజేంద్ర ప్రసాద్ గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసి రెడ్డి కొనియాడారు. మంగళవారం బాబూ రాజేంద్ర ప్రసాద్ 140వ జయంతిని వేంపల్లెలో ఘనంగా నిర్వహించారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపారని అన్నారు.