పులివెందుల పట్టణంలోని వైయస్ లో వీఆర్ఎస్ఐ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఈ నెల 7వ తేదీ నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపల్ గణేశ్ తెలిపారు. బుధవారం ఆయన తెలుపుతూ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు కళాశాల ఆఫీసులో సంప్రదించి అప్లికేషన్లు పొందవచ్చు అన్నారు. ఈ ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం బోధించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.