చంద్రబాబుకు చెంచా గిరి చేస్తున్నావా అంటూ వైసీపీ నేత సతీశ్ రెడ్డి వైఎస్ షర్మిలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పులివెందుల పట్టణంలోని స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ద్వితీయ స్థానంలో ఉన్న వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ రాదంటే ప్రజలు దీన్ని సమర్థిస్తారా అని ప్రశ్నించారు. జగన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.