పులివెందుల పట్టణంలోని శ్రీమిట్ట మల్లేశ్వర స్వామి ఆలయ తలుపులు గురువారం ఉదయం మూసి ఉండడంతో భక్తులు వెనుతిరిగి వెళుతున్నారు. అర్చకుల మధ్య గొడవలు ఉండడంతోపాటు వారి మధ్య సమన్వయం లేకపోవడంతో ఉదయం నుంచి గుడి తలుపులు మూసివేశారని స్థానికులు తెలిపారు. దీంతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. శివాలయంలో అర్చనలు చేయించాలన్నా, పూజ చేయాలన్నా పూజారులకు చేయి తడపాల్సిందేనని భక్తులు వాపోతున్నారు.