జర్నలిస్టులు సమాజ సేవకు కృషి చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం జేశాప్ అసోసియేషన్ జిల్లా మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల వృత్తి ఒత్తిడితో కూడుకున్నదని, వారికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. గతంలో మాదిరిగా జేశాప్ క్రీడలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.