జిల్లాలో జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ చేతగాని దద్దమ్మ రాజకీయాలకు పాల్పడిందని ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పులివెందుల టీడీపీ ఇన్ ఛార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే నోడ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా వీఆర్వోలను నిర్బంధించింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. జైల్లో ఖైదీలను పెట్టినట్లు మండలం ఆఫీసుల్లో వీఆర్వోలను ఉంచారని ఆరోపించారు.