రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల గోడు ఏ మాత్రం పట్టడం లేదని కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డా. తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లిలో మాట్లాడుతూ. రైతులు పండించిన ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లభించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా రైతుకు లభించడం లేదని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరవలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మాటలు మాత్రమే చెప్తుందని, పంటలు మాత్రం కొనలేదన్నారు.