వేంపల్లి: అసెంబ్లీకి రాకపోతే జగన్ రాజీనామా చేయాలి

59చూసినవారు
జగన్ రెడ్డికి శాసనసభకు రావడం ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తారని ప్రజలు జగన్ను గెలిపిస్తే శాసనసభకు రాకుండా ఉండటం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల్లో 11 సీట్లు వచ్చినంత మాత్రాన ప్రజలను గాలికి వదిలేయడం ఏంటని మండిపడ్డారు. అసలు అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేకపోతే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్