రైతులను ఆదుకోవడంలో టీడీపీ, వైసీపీలు దొందూ దొందేనని కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి విమర్శించారు. మంగళవారం వేంపల్లెలో మాట్లాడుతూ.. వారి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ రైతు మిత్ర పార్టీ అని అన్నారు. అకాల వర్షాలకు, పెనుగాలులకు దెబ్బతిన్న పంటలకు రూ. 20 వేలు నష్టపరిహారం రైతులకు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.