వేంపల్లి: చంద్రబాబు, జగన్ పై తులసిరెడ్డి మండిపాటు

67చూసినవారు
చంద్రబాబుకు స్వర్ణాంధ్ర 2047 పిచ్చి, జగన్ కు ప్రతిపక్ష పిచ్చి పట్టిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి మండిపడ్డారు. గురువారం వేంపల్లిలో మాట్లాడుతూ  రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా గురించి ఇద్దరు పట్టించుకోలేదన్నారు. ఎప్పుడో వచ్చే 2047 గురించి సీఎం మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానడటం సమంజసం కాదన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నారు.

సంబంధిత పోస్ట్