
పులివెందుల: ఆర్టీసీ సిబ్బంది సమస్యలను పరిష్కరించండి
ఆర్టీసీ సిబ్బంది అపరిస్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని నేషనల్ మద్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకుడు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పులివెందుల పట్టణంలోని స్థానిక నూతన ఆర్టీసీ బస్టాండ్ వద్ద నేషనల్ మద్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ సిబ్బందికి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని ఎండీకి వారు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.