

చక్రాయపేట: గండి అంజన్న సేవలో నూతన జడ్పీ ఛైర్మన్
చక్రాయపేట మండలం గండిక్షేత్రంలోని శ్రీవీరాంజనేయ స్వామిని కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చక్రాయపేట, వేంపల్లి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.