హత్య సినిమాపై ఫిర్యాదు చేస్తే వైసీపీ నాయకులకు ఉలికిపాటు ఎందుకని వైఎస్ వివేకా హత్య కేసు అనుమానితుడు సునీల్ యాదవ్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందుల వైఎస్ఆర్ క్లబ్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సునీల్ యాదవ్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి నేను కోట్లకు పడగలెత్తడం జరిగిందని పేర్కొన్నారని నేను కోట్లకు పడగలెత్తి ఉంటె అద్దె భవనాల్లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.