పులివెందులలో నిర్మాణంలో ఉన్న క్రికెట్ స్టేడియం గురించి ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పట్టణ మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం క్రికెట్ స్టేడియం సామాగ్రిని తరలిస్తున్న కాంట్రాక్టర్ను ఆయన అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పులివెందులకు ప్రభుత్వాన్ని నిధులను అడిగేందుకు ఎమ్మెల్యే జగన్ కు నామోషీగా ఉందన్నారు.