పులివెందుల: పేదవాడి చెమట చుక్కల నుంచి పుట్టిన పార్టీ టీడీపీ

54చూసినవారు
పేదవాడి చెమట చుక్కల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీటెక్ రవి అన్నారు. శనివారం పులివెందుల టీడీపీ కార్యాలయంలో టీడీపీ 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఇంచార్జ్ బిటెక్ రవి టీడీపీ జెండాను ఎగురవేసి ఎన్టీఆర్ కి పులమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా రాజకీయాలను శాసించే స్థాయికి వెళ్ళాలి అంటూ ఇటు పార్టీలోనూ, అటు పాలనలోనూ పదవులు ఇచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్