

పులివెందుల: 3 నెలలుగా అందని రేషన్
గత మూడు నెలల నుంచి రేషన్ బియ్యం సక్రమంగా పంపిణీ చేయలేదని 32వ వార్డు కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి అధికారులను నిలదీశారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాలులో మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉండగా. కేవలం నాలుగైదు రోజులు మాత్రమే రేషన్ ఇస్తున్నారన్నారు.