ఇడుపులపాయలో వైఎస్ ఆర్ కు జడ్పీ ఛైర్మన్ నివాళి

60చూసినవారు
కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ రామ గోవింద్ రెడ్డి నివాళి అర్పించారు. ఉమ్మడి కడప జిల్లా జిల్లా పరిషత్ ఛైర్మన్ గా రెండు రోజుల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శనివారం వైఎస్ సమాధి వద్దకు వచ్చారు. తనకు 2006లో ఎంపీటీసీగా వైఎస్ మొదటిసారి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్