పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి లో శ్రీరామనవమి పండగను పురస్కరించుకుని ఆదివారం గ్రామస్థులు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరాలు సమర్పించారు. సీతారాముల కళ్యాణాన్ని భక్తులు తిలకించి తరించారు. భక్తులకు వడపప్పు పానకం పంచి పెట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.