ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్ జగన్ సమీప బంధువు విజయ శేఖర్ రెడ్డి మృతదేహానికి ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం తెల్లవారుజామున విజయ శేఖర్ రెడ్డి మరణించిన విషయం విదితమే. నివాళులర్పించిన వారిలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, బంధువులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.