
గాలివీడు: "అక్రమ అపార్ట్మెంట్ పై చర్యలు తీసుకోవాలి"
గాలివీడు రోడ్ పెట్రోల్ బంక్ వద్ద అక్రమంగా కట్టిన అపొర్ట్ మెంట్ యూజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీపీఐ (ఎం ఎల్) లిబరేషన్ జిల్లా నాయకులు విశ్వనాథ ప్రశ్నించారు. లిబరేషన్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాలను తొలగించాలని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించినా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.