డా. బాబు జగ్జీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా, అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పగుచ్ఛాలతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఘన నివాళులర్పించినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,
మహనీయుల ఆదర్శాలను పాటిస్తూ సమ సమాజ స్థాపనకు కృషి చెయ్యాలన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని కొనియాడారు.