అప్పుల బాధ తాళలేక ఓ యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం ములకలచెరువులో జరిగింది. ఎస్ఐ నరసింహుడు తెలిపిన వివరాల మేరకు చీకచెట్టుపల్లికి చెందిన భయ్యా రెడ్డి టమటా పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయినట్లు వివరించారు. సాగు ఖర్చుకై చేసిన 16 లక్షల అప్పు తీర్చలేక.. పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.