శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి బుధవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు స్వామి వ్రత మండపంలో వ్రతాలు ఆచరించారు. భక్తులు నిర్వహించిన వివిధ సేవల ద్వారా ఆలయానికి రూ. 16, 87, 230 ఆదాయం లభించిందని ఆలయ అధికారులు తెలిపారు.