సీబీఎస్ఈ సిలబస్ అనుబంధ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అధిక ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను శుక్రవారం ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్ వద్ద ఆయన జిల్లాలోని సోషల్, బీసీ వెల్ఫేర్, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారికి ఆయన పలు సూచనలు చేశారు.