ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలుపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ఆయన అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు గురువారం అమలాపురంలోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ చంద్రబాబుకు వివరాలు తెలియజేశారు.