అమలాపురం: వన సమారాధన విజయవంతం చేద్దాం: మంత్రి సుభాష్
అమలాపురంలో ఆదివారం శెట్టి బలిజ వన సమారాధన మరింత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని అందరూ సహకరించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. అమలాపురంలో మంత్రి నివాసంలో శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సమారాధన మిగిలిన కులాలకు ఆదర్శంగా ఉండాలని ఆయన అన్నారు. యువత ఎటువంటి హంగామా చేయవద్దని, సైలెన్సర్లు తీసి వాహనాలు నడపవద్దని, పోలీసులకు పూర్తిగా సహకరించాలని మంత్రి కోరారు.