కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఇంటి వద్దకే పింఛన్లు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం, పొలమూరు గ్రామాల్లో మంగళవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి పింఛన్లను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి నేరుగా లబ్ది దారులకు పింఛన్ అందజేశారు.