సోలార్ వినియోగంతో విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవడమే కాకుండా ప్రభుత్వ అవసరాలకు విద్యుత్ విక్రయించవచ్చని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం మహేంద్రవాడలో సూర్య ఘర్ యోజన పథకం ద్వారా గ్రామానికి చెందిన డాక్టర్ కృష్ణారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్ టాప్ ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్సిడీ వివరాలతో రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.