అయినవిల్లి మండల పరిధిలోని గ్రామాలలో ప్రజలకు లో వోల్టేజి సమస్యకు పరిష్కారం చూపేందుకు అయినవిల్లిలో రూ. 206 కోట్ల వ్యయంతో 400 కేవి విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణ పనులు చేపడుతున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణ పనులను ఆయన స్థానిక అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. విద్యుత్ కేంద్రం పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.