అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామదేవత వనువులమ్మ ఆలయంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం, 10వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఏకాహం(భజన ) కార్యక్రమం నిర్వహించారు. వేకువజాము నుంచే అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లుచేశారు.