విఘ్నేశ్వరుని ఆలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

56చూసినవారు
అయినవిల్లి మండల వ్యాప్తంగా గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా జరిగాయి. అయినవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ఆలయ కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణరాజు పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్