మామిడికుదురు మండలం పాశర్లపూడిలోని కైకాల పేట నుంచి అమ్మ మార్కెట్ వరకు ప్రాణగండంగా మారిన జాతీయ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రయాణికులు మంగళవారం డిమాండ్ చేశారు. ఈ దారి ప్రమాదాలకు నిలయంగా మారిందని వాపోతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తక్షణం స్పందించి జాతీయ రహదారి ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.