గ్రామీణ ప్రాంతాల్లోని గర్భవతులకు అంగన్వాడి కేంద్రాల్లోని పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించడానికి పోషణ వాటికలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డిగూడెంలోని వాటికను శుక్రవారం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పరిశీలించారు. వాటికల్లో పండిస్తున్న ఆకుకూరలు, కూరగాయల పంటలను ఆయన పరిశీలించి గర్భవతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగలక్ష్మి, సూపర్‌వైజర్ విజయశాంతి, కార్యదర్శి రాణి పాల్గొన్నారు.