గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం చేయటానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని దేవరపల్లి తహశీల్దార్ రాజ్యలక్ష్మి అన్నారు. శనివారం దేవరపల్లి మండలంలోని కురుకూరు గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గ్రామంలోని ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సదస్సులో రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.