గ్రామాలలో కుళ్ళి పేరుకుపోయే చెత్తను ఒక పద్ధతి ప్రకారం వేరు చేయడం ద్వారా సంపద సృష్టించవచ్చని తాడేపల్లిగూడెం మండల పరిషత్ పంచాయతీ విస్తరణాధికారి వెంకటేష్ పేర్కొన్నారు. పారిశుధ్యంపై సర్పంచులకు,కార్యదర్శులకు జగన్నాధపురంలో మంగళవారం శిక్షణ కార్యక్రమం కొనసాగించారు. ఈ సందర్భంగా గ్రామంలో చెత్త ఏ విధంగా సేకరించాలి,సేకరించిన చెత్తను ఎలా వేరు చేయాలి దాని నుంచి ఎలా సంపద సృష్టించవచ్చు అనే అంశాలను వివరించారు.