కోడి పందేలు, జూదం ఆడుతున్న 33మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివనాగబాబు తెలిపారు. గండేపల్లి, ఎన్టీ. రాజపురం, యల్లమిల్లి, నాయకంపల్లి, మల్లేపల్లి, కె. గోపాలపురం తదితర గ్రామాల్లో కోడి పందేలు, జూదాలు నిర్వహించారన్నారు. సంక్రాంతి మూడు రోజులు 12 కేసుల్లో 33 మందిపై కేసు నమోదు చేశామన్నారు. 13 కేసుల్లో 39 మందిపై కేసు నమోదు చేసినట్లు జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు తెలిపారు.