ముస్లింలకు సంబంధించిన వక్స్ బోర్డు చట్టాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్లో తీర్మానం ప్రవేశపెట్టనున్నారని దానిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని జగ్గంపేట ముస్లిం సోదరులు కోరారు. శనివారం జగ్గంపేటలోని స్థానిక మసీదు వద్ద వారు మీడియాతో మాట్లాడారు. ప్రధాని
మోదీ ముస్లింలకు వ్యతిరేకమైన విధానాలు చేపడుతున్నారన్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కేంద్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఆరోపించారు.