కాకినాడ వేర్‌హౌస్‌ గోదాముల్లో సార్టెక్‌ మెషీన్ల కలకలం

68చూసినవారు
కాకినాడ వేర్‌హౌస్‌ గోదాముల్లో సార్టెక్‌ మెషీన్ల కలకలం
కాకినాడ వేర్‌హౌస్‌ గోదాముల్లో నిబంధనలకు విరుద్ధంగా సార్టెక్‌ మెషీన్లు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. సోమవారం సీఎంతో జరిగిన భేటీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. గోదాముల్లోనే బియ్యం రీసైక్లింగ్‌ జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇదే అంశాన్ని మంత్రివర్గ ఉప సంఘం భేటీలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ చర్చించారు. ఈ మెషీన్లను ఎప్పుడు, ఎవరు ఏర్పాటు చేశారని అధికారులను ప్రశ్నించగా.. వారి నుంచి సరైన సమాధానం రాలేదు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్