కాకినాడ రూరల్: ఆహ్లాదకరంగా బోటు క్లబ్ ఉద్యానవనం
బోటు క్లబ్ ఉద్యానవనాన్ని ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే రీతిలో మరింత అభివృద్ధి చేయనున్నట్లు కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వాకర్స్ సంఘ అధ్యక్షులు అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం బోటు క్లబ్ ఉద్యానవనాన్ని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పరచాలని కోరుతూ ఎమ్మెల్యే నానాజీకి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.