ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి జిల్లాల నీటి సంఘం ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి జిల్లాల నీటి సంఘాల ఎన్నికలు మంగళవారం కాకినాడ ఇంద్రపాలెం లాకులు వద్ద నీటి సంఘం కార్యాలయం వద్ద ప్రశాంతంగా జరిగాయి. అత్యధిక స్థానాలను కూటమి నేతలు కైవసం చేసుకున్నారు. తాళ్ళరేవు నీటి సంఘం అధ్యక్షులుగా భాస్కర్ రాజు, మొగతూర్తి శ్రీనివాసరావు, మంజూరు నీటి సంఘం అధ్యక్షులుగా సత్యనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.