డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడి లో గురువారం సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. ద్వారపూడి ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు కొందరు ప్రయత్నించగా ఇతర సామాజిక వర్గానికి చెందిన కొంతమంది విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. రామచంద్రపురం డిఎస్పి రామకృష్ణ ద్వారపూడి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. గ్రామంలో పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు